Telangana Rain updates: సోమవారం నాడు అన్ని విద్యాసంస్థలకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.

Telangana Rain Updates: Hyderabad: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. రేపు సెప్టెంబరు 2,2024న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడతాయని, అన్ని ప్రభుత్వ శాఖల సెలవులను రద్దు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana rain updates, Schools and colleges declared holiday on monday

రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి మున్సిపల్‌, ట్రాన్స్‌కో, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, హైడ్రామా, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శి, అధికారులు హాజరయ్యారు.

మరోవైపు వాతావరణం అనుకూలించకపోవడంతో సెప్టెంబర్ 2న జరగాల్సిన అన్ని పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. పలు యూనివర్శిటీ భవనాలు నీటమునిగడంతో విద్యార్థులు హాజరుకావడం సురక్షితం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. “మేము పరీక్షలకు కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తాము” అని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.

Telangana Rain Updates:

ఇదే విషయం పై సీఎం రేవంతా రెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడుతూ “రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula  అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి శ్రీ @Bhatti_Mallu, మంత్రివర్యులు శ్రీ @UttamINC , శ్రీ @Tummala_INC, శ్రీ @DamodarCilarapu, శ్రీ @jupallyk_rao, ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్‌, పంచాయతీరాజ్‌, హైడ్రా, నీటి పారుదల శాఖ అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  

అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు రద్దు చేసుకొని వెంటనే విధుల్లో నిమగ్నం కావాలని చెప్పారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకి రావొద్దని ముఖ్యమంత్రిగారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.  

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ అవసరమైన సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు అలెర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.”

మరో వైపు తెలంగాణలో బారి వర్షాలు, వరద పరిస్థితులను కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, సీఎం. రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం.. వరదల వల్ల వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా గారు హామీ ఇచ్చారు.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
We use cookies in order to give you the best possible experience on our website. By continuing to use this site, you agree to our use of cookies.
Accept