Tirupati temple stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన లో బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా
Tirupati Temple Stampede: తిరుపతిలోని బైరాగిపట్టేడలోని వైకుంఠ ఏకాదశి టోకెన్ పంపిణీ కేంద్రం సమీపంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. అసలేమైంది తిరుమల కొండల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా, కనీసం 40 మంది గాయపడ్డారు. టోకెన్లు తీసుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ సంఘటన […]