Gudlavalleru Engineering College: గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా పెట్టినట్లు ఒక విద్యార్థిని హెచ్చరికతో వందలాది మంది విద్యార్థినులు రాత్రిపూట ధర్నా చేశారు.
ANDHRA PRADESH: బాలికల హాస్టల్ వాష్ రూమ్ లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన. ఆంధ్రప్రదేశ్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన ఘటన కలకలం సృష్టించింది. యూనివర్శిటీల్లో పరిస్థితులు ఎలా ఉంటాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బాలికల టాయిలెట్స్ లో విద్యార్థులు రహస్య కెమెరాను కనుగొన్నారు. కొందరు దుండగులు మహిళల టాయిలెట్స్ లో రహస్యంగా కెమెరాలు అమర్చారు. ఇది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఘటనపై వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు.
అయితే యాజమాన్యం సరిగా స్పందించక పోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు నిందితుడిని వెంటనే శిక్షించాలని ఆందోళనకు దిగారు. యాజమాన్యం వెంటనే స్పందించి ఇలాంటి దారుణ ఘటనలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం యూనివర్శిటీ క్యాంపస్ లో మాకు న్యాయం కావాలి అని నినాదాలు చేసారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు యూనివర్సిటీ యంత్రాంగం ప్రయత్నించింది.
దీంతో మీడియాకు సమాచారం రాకుండా యూనివర్సిటీ గేట్లను మూసివేశారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ ‘We want Justice’ అంటూ విద్యార్థినిలు నినాదాలు చేసారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నం చేసారు. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్నారు పోలీసులు.
ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగిదింది. ఈ ఘటనలో ఫైనల్ ఇయర్ విద్యార్థికు, మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపనలు వినిపిస్తున్నాయి. బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ. ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు విద్యార్థులు.
వారం రోజులుగా ఇంత జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ను విద్యార్థినీలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసిన మేనేజ్మెంట్ స్పందించలేదంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ విషయంపై AP సీఎం. చంద్రబాబు నాయుడు తక్షణమే విచారణకి ఆదేశించారు. బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా పెట్టినట్లు ఒక విద్యార్థిని హెచ్చరికతో వందలాది మంది విద్యార్థినులు గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వద్ద రాత్రిపూట ధర్నాకు దిగారు.
అయితే సమాచారం తెలుసుకుని, కళాశాలకు చేరుకుని ప్రాథమిక విచారణ జరిపిన కృష్ణా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) ఆర్ గంగాధర్ రావు, బాలికల హాస్టల్‌ను తనిఖీ చేసినప్పుడు పోలీసులకు ఎలాంటి రహస్య కెమెరాలు లభించలేదని తెలిపారు.
ఈ విషయం పై వారు స్పందిస్తూ, “విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది సమక్షంలో అనుమానిత విద్యార్థి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను కూడా స్వాధీనం చేసుకున్నాము. వీడియోలు ఏవీ కనుగొనబడలేదు. ఈ విషయంలో విద్యార్థినులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భావిస్తున్నాను. విచారణ ఇంకా కొనసాగుతుంది” అని రావు చెప్పారు.
ఇదే విషయమై అటు హోమ్ మంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ, “ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, హిడెన్ కెమెరాల ఉన్నాయి అనే అంశంపై విచారణకు ఆదేశించడం జరిగింది.తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోని, ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించడం జరిగింది” అన్నారు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని,
— Anitha Vangalapudi (@Anitha_TDP) August 30, 2024
హిడెన్ కెమెరాల ఉన్నాయి అనే అంశంపై విచారణకు ఆదేశించడం జరిగింది.తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోని, ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు…